విజయవాడ : తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్‌టి రామారావు వారసురాలు, ఏపీ సీఎం చంద్రబాబు కోడలు బ్రహ్మణికి రాజకీయ యోగం ఉందా? ఆమె త్వరలో క్రియాశీలక రాజకీయాల్లోకి రానున్నారా? అంటే... అవుననే అంటున్నారు జ్యోతిష పండితులు. ఆమె తన తాత ఎన్టీఆర్ వారసురాలని, అకస్మాత్తుగా రాజకీయాల్లోకి వచ్చి అద్భుతాలు సృష్టిస్తారని జోస్యం చెపుతున్నారు.
2017లో నారా బ్రహ్మణి రాజకీయ అరంగేట్రం చేస్తారని, విజయవాడ నుంచి ఆమె ఎంపీగా పోటీచేసే అవకాశాలున్నాయని చెపుతున్నారు. ఇప్పటికే సీఎం తనయుడు నారా లోకేష్ క్రియాశీలక రాజకీయాల్లో చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయనకు తోడుగా సతీమణి బ్రహ్మణి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి చక్రం తిప్పుతారనే అంచనాలు వేస్తున్నారు.
ఇప్పటికే బ్రహ్మణి అండర్‌గ్రౌండ్ వర్క్ చేస్తున్నారని, తెలుగుదేశం పార్టీ కోసం సర్వేలు నిర్వహించడం, రహస్యంగా సీఎంకు నివేదికలు సమర్పించడం చేస్తున్నారని తెలుస్తోంది. ఆమె చేస్తున్న స్మార్ట్ వర్క్ తెలుగుదేశం అధినేతకు కూడా ఆశ్చర్యం కలిగిస్తోందని సమచారం. ఈ నేపథ్యంలో ఆమె ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వస్తే, వచ్చే రెస్పాన్స్ అమితంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.