అయితే 150వ చిత్రంలో బిజీగా ఉన్న చిరంజీవి కాస్త ఆలస్యంగానే చేరాలన్న నిర్ణయంలో ఉన్నట్లు సమాచారం. అయితే అంతలోనే చిరంజీవి తెదేపాలో చేరిపోయినట్లుగా ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. చిరు కుమారుడు నటించిన ధృవ సినిమా ఫ్లెక్సీలో చిరంజీవి ఫోటో పక్కనే నారా లోకేష్ ఫోటో పెట్టడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఎపిలోని చాలా ప్రాంతాల్లో ఈ ఫ్లెక్సీలో కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దగా పట్టించుకోకపోయినా చిరు అభిమానులు మాత్రం ఆలోచనలో పడ్డారు.
తెదేపా తీర్థం పుచ్చుకోకముందే ఈ ఫ్లెక్సీలలో కొంతమంది అభిమానులు ఇలాంటి ఫోటోలు పెట్టడం ఏమిటని మాట్లాడుకుంటున్నారు. నారా లోకేష్ ఇప్పటికే సంప్రదింపులు జరిపారు కానీ.. ఆ తరువాత షూటింగ్ జరుగుతుండటం చిరు కాస్త బిజీగా ఉండటంతో లోకేష్ కూడా సైలెంట్ అయిపోయారు. కానీ ఈ మధ్యలో లోకేష్ చిరుతో ఒకసారి ఫోన్‌లో కూడా మాట్లాడినట్లు కూడా తెలుస్తోంది. చిరు సినిమా విడుదలైన తరువాతనో లేకుంటే షూటింగ్ అయిపోయిన తరువాతనో పార్టీ తీర్థం పుచ్చుకోవాలన్న నిర్ణయానికి చిరు వచ్చేసిట్లు తెలుస్తోంది.