టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ ఓ టీ షాపుకెళ్లి టీ సేవించారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురానికి చెందిన చెంగాచారి సాధారణ టిడిపి కార్యకర్త. గృహప్రవేశం నిమిత్తం కుప్పం వచ్చిన నారా లోకేష్‌ను కలిశాడు. చెంగాచారి బాగోగులను వాకబుచేసిన లోకేష్ మాటల్లో ఏం చేస్తుంటావని అడిగాడు. తాను తెలుగుదేశం పార్టీ వీరాభిమానినని, శాంతిపురంలో టీకొట్టు నడపుతూ జీవనం సాగిస్తున్నానని చెప్పాడు.
గత ఏడాది జూన్ 12న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక 17వ తేదీ మళ్లీ టీకొట్టు ప్రారంభించా. నాకు ఇద్దరు ఆడబిడ్డలు, ఒకబిడ్డకు పెళ్లయింది. మరో కూతురికి పెళ్లి చేయాలి. మీరు మా అంగడికి రావడం నమ్మలేక పోతున్నా చిన్నయ్యా అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. చెంగాచారి భుజం తట్టిన యువనేత లోకేష్... ఇప్పుడు నువ్వు ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. నీ వెంట నేనున్నా... ఏ అవసరమొచ్చినా నాకు ఫోన్ చెయ్యి అని చెప్పి ముందుకు సాగారు. కార్యకర్తకు యువనేత లోకేష్ ఎంతటి ప్రాధాన్యత నిస్తారనడానికి ఇదొక మచ్చుతునక.