ఈ ప్రయోగానికి అడ్వాన్స్‌డ్ సూపర్‌సోనిక్ ప్యారాచ్యూట్ ఇన్‌ఫ్లేషన్ రీసెర్చ్ ఎక్స్‌పెరిమెంట్ (ఆస్పైర్) అని పేరు పెట్టారు. అక్టోబర్ 4న అమెరికాలోని నాసా గొడార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ నుంచి జరిగిన ఈ ప్రయోగంలో ముందు రాకెట్ ద్వారా మార్స్ మీదకి పేలోడ్‌ని పంపి, అక్కడ అది ల్యాండ్ అయ్యే సమయంలో ప్యారాచ్యూట్ స్థితిగతులను, మార్పులను అధ్యయనం చేశారు. ఆ అధ్యయనానికి అనుగుణంగా ప్యారాచ్యూట్ తయారీలో లోపాలను సవరించడం వంటి మార్పులు చేస్తారు.
ఈ ప్రయోగానికి సంబంధించిన వీడియోను నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ తమ యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో రాకెట్ ప్రయోగం నుంచి పే లోడ్ ల్యాండ్ కావడం, ప్యారాచ్యూట్ తెరుచుకోవడం, రాకెట్ తిరిగి అట్లాంటిక్‌లో పంపడం ఈ వీడియోలో చూడొచ్చు. ఆ వీడియోనూ మీరూ తిలకించండి.