జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అనంతపురం నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. అయితే ప్రస్తుతం ప్లాన్ మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలో అనంత నుంచి కాకుండా బాగా పట్టున్న నియోజక వర్గం నుంచి పోటీ చేసేందుకు వెతుకులాట ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పవన్ కదిరిని ఎంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కదిరితో పాటు తాడిపత్రి, ఉరవకొండ, సింగనమల నియోజక వర్గాల్లో పోటీ చేసే దిశగా పవన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే గుంతకల్లును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
అనంతలో పోటీ చేస్తానని ప్రకటించిన పవన్ కల్యాణ్.. టీడీపీ తరపున హిందూపురం నుంచి అనంతపురంకు బాలయ్య జంప్ కావడంతో రూటు మార్చుకున్నారని తెలుస్తోంది. హిందూపురం అభివృద్ధికి బాలయ్య ఎంతగానో కృషి చేస్తున్నారని, సినిమాలు చేస్తూనే.. తన నియోజకవర్గం అభివృద్ధికి బాగా కష్టపడుతుండటంతో.. ఆయనతో అనంతలో పోటీచేస్తే ఓటర్లు తనకు ఆదరణ చూపే అవకాశం ఉండదని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అందుకే బాలయ్యతో పోటీ ఎందుకని.. పవన్ రూటు మార్చుకున్నట్లు సమాచారం. అందుకే తొలుత అనంతను అనుకున్నా.. ప్రస్తుతం కదిరి వైపు ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. సర్వేల ప్రకారం పవన్ కల్యాణ్ నియోజక వర్గాన్ని ఎంచుకునే అవకాశం ఉన్నట్లు జనసేన పార్టీ వర్గాల సమాచారం. మరి పవన్ ఏ నియోజక వర్గం నుంచి ఫోకస్ చేస్తారో వేచి చూడాలి.