రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను బహిర్గతం చేయాలంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విధించిన డెడ్‌లైన్ నేటితో ముగియనుంది. అయితే, ఈ డెడ్‌లైన్‌పై ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వాలు ఏమాత్రం స్పందించలేదు కదా, పవన్ కళ్యాణ్‌ను హెచ్చరికలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లైట్‌గా తీసుకున్నట్టు కనిపిస్తున్నాయి. దీంతో తదుపరి పవన్ ఎటువంటి ప్రకటన చేస్తారన్న విషయమై ఆసక్తి నెలకొంది.
ఏపీకి చేసిన సాయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫిబ్రవరి 15లోగా వివరణ ఇవ్వాలని గతంలో పవన్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ గడువు నేటితో ముగియనుంది. కాగా, ఇప్పటికే లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్, కాంగ్రెస్ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్‌లతో చర్చలు జరిపిన జనసేనాని, శుక్రవారం వామపక్ష నేతలను, ఇతర ప్రతినిధులను కలసి వారితో చర్చించనున్నారు. ఇక తాను పెట్టిన డెడ్‌లైన్ ముగిసేలోగా, ప్రభుత్వం నుంచి వచ్చే స్పందన ఆధారంగా భవిష్యత్ కార్యాచరణను పవన్ కల్యాణ్ ప్రకటిస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.