రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా రాగుళ్ళ వాగులో వరద ఉదృతి లో చిక్కుకున్న ఇద్దరు రైతులను రెస్క్యూ సిబ్బంది కాపాడారు. రెస్క్యూ సిబ్బందితో కలిసి ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహాయ చర్యల్లో పాల్గొన్నారు.
మొదట రైతులను కాపాడేందుకు హెలికాప్టర్లను తెప్పించారు. కాగా, వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ల సహాయక చర్యలు ముందుకు సాగలేదు. వెను వెంటనే స్పీడ్ మోటార్ బోట్ లను తెప్పించి రైతులను కాపాడారు. ఇద్దరు రైతులను కాపాడగలిగారు. మరో రైతు వరద ఉధృతి లో గల్లంతయ్యాడు. గల్లైంతైన రైతును కాపాడే చర్యలు చేపట్టారు.