నోట్ల కట్టలు ఒకవైపు, ఇసుక మరోవైపు: తిరుపతిలో బిజెపి వినూత్న నిరసన

మంగళవారం, 23 మార్చి 2021 (20:10 IST)
తిరుపతిలో బిజెపి  నేతలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు నేతృత్వంలో బిజెపి నేతలు ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించి నూతన ఇసుక విధానానికి సంబంధించిన టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. 
 
తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నూతన ఇసుక విధానానికి సంబంధించి టెండర్లను రద్దు చేయాలంటూ బిజెపి నిరసనకు  చేపట్టగా పోలీసులు అడ్డుకుని నోటీసులు జారీ చేరశారు. దీంతో పోలీసులకు, బిజెపి నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం ఏర్పడింది.
 
త్రాసు తీసుకొచ్చి ఒక వైపు ఇసుక..మరొవైపు డబ్బును ఉంచి తులాభారం వేశారు బిజెపి నేతలు. వినూత్నంగా ఈ నిరసన చేపట్టారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రప్రభుత్వం వెంటనే టెండర్ల రద్దు చేయకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని సోము వీర్రాజు హెచ్చరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు