చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మునగళపాళెంలో ఇసుక మాఫియాకు పాల్పడుతున్న 13 మందిలో ఐదుగురు నిందితులు పోలీసులకు లొంగిపోయారు. కీలక వ్యక్తిలో ఒకరైన చిరంజీవి నాయుడు శ్రీకాళహస్తి డిఎస్పీ ఎదుట లొంగిపోయారు. మరో ఇసుక మాఫియా డాన్ ధనంజయ నాయుడు అన్న చిరంజీవి నాయుడు. చిరంజీవితో పాటు భాస్కర్ నాయుడు, సుబ్రమణ్యం నాయుడు, వెంకటరత్నం నాయుడు, రామానాయుడులు కూడా పోలీసులకు లొంగిపోయారు.