సోమవారం బాలుడికి కరోనా నిర్ధారణ కాగానే కుటుంబసభ్యులను ఐసొలేషన్‌కు తరలించారు. మంగళవారం బాలుడి అమ్మమ్మ, తాత, తల్లి, చెల్లికి కరోనా నిర్ధారణ పరీక్షలో నెగెటివ్ వచ్చింది. తండ్రి ఫలితాలు రావాల్సి ఉన్నది.
ఇదిలా ఉంటే.. పాతబస్తీలో పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. ఓల్డ్ సిటీ మరింత రిస్క్ జోన్‌లోకి వెళ్తోంది. జనసాంద్రత ఎక్కువగా ఉండటం, ఢిల్లీకి మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు ఈ ప్రాంతంలో పర్యటించడం ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 592 కేసులు నమోదు కాగా, హైదరాబాద్‌లో 267 కేసులు నిర్థారణైయ్యాయి. కేవలం పాతబస్తీ నుంచే 57 కేసులు నమోదయ్యాయి. పాతబస్తీలో పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. వైరస్ ప్రభావం ప్రారంభంలో తక్కువగా ఉన్నా ఢిల్లీ మత ప్రార్థనల తర్వాత ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగింది.