ఈనెల 5న భక్తబృందం అమ్మవారికి తెచ్చిన ఆషాడ మాసం సారెలో ఖరీదైన చీర మాయం అయింది. పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలత కుమారిపై ఆరోపిస్తూ భక్త బృందం లిఖితపూర్వకంగా పాలకమండలి ఛైర్మెన్ గౌరంగబాబుకు ఫిర్యాదు చేశారు. విషయం పెద్దది కావడం, మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఆలయ అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు.
ముఖ్యమంత్రి ఆదేశాలతో దుర్గగుడి ఈవో, ఇన్‌చార్జ్ కమిషనర్ పద్మ సమగ్ర నివేదిక చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఆలయ ప్రధానార్చకులు, సిబ్బందిని విచారించిన అనంతరం పాలకమండలి సభ్యురాలు సూర్యలత కుమారి చీరను తీసుకెళ్లినట్లు నిర్ధారణ కావడంతో ట్రస్ట్ బోర్డు నుంచి ఆమెను తొలగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఉత్తర్వులు జారీచేశారు.