ఆ తర్వాత హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు తిరుగుపయనమైంది. కామారెడ్డి స్టేషన్‌కు ముందు.. ఆ యువతి ప్రయాణిస్తున్న రైలుకు సిగ్నల్ లేకపోవడంతో ఆగింది. అదేసమయంలో మరో ట్రాక్‌పై ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ అమితవేగంతో వస్తోంది. దీన్ని గమనించిన ఆ యువతి.. ఉన్నట్టుండి రైలు దిగి.. వేగంగా వస్తున్న ఇంటర్ సిటీ రైలుకింద పడిపోయింది. దీంతో ఆ యువతి అక్కడికక్కడే చనిపోయింది.
లెవల్ క్రాసింగ్ వద్ద సరదాగా సెల్‌ఫోన్‌లో వీడియో తీసిన ఓ యువకుడు హఠాత్తుగా ఆమె ట్రైన్ కిందపడటం చూసి షాకై, వీడియో తీశాడు. ఆ తర్వాత యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. ఈ వీడియో చూసిన వారంతా భయబ్రాంతులకు లోనవుతున్నారు. పోలీసులు ఈ వీడియో పుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.