శ్రీ రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాలను ప్రారంభించనున్న గవర్నర్‌

శనివారం, 7 మే 2016 (16:56 IST)
ఈనెల 10వ తేదీన శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ ప్రారంభించనున్నట్లు తితిదే ఈఓ సాంబశివరావు వెల్లడించారు. ఈ ఉత్సవాలు 2017 మే ఒకటవ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. శ్రీ రామానుజ సహస్రాబ్ది సంచార రథం 106 దివ్యదేశాలలో ప్రయాణించే మార్గాన్ని 30 క్లస్టర్లుగా విభజించి శ్రీవారి కళ్యాణాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తితిదే ఆధ్వర్యంలో నిర్వహించే ఉత్సవాల్లో సంవత్సరం పాటు జరిపేది ఈ ఉత్సవాలే కావడం గమనార్హం. 
 
శ్రీ వేంకటేశ్వర బధిర పాఠశాలలో ప్రవేశాలు 
తితిదే ఆధ్వర్యంలో తిరుపతిలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర బధిర పాఠశాలలో 2016-17వ విద్యాసంవత్సరానికి ప్రిపరేటరీ తరగతిలో ప్రవేశానికి గాను అర్హులైన విద్యార్థుల నుంచి ధరఖాస్తులు ఆహ్వానించింది. బధిర పాఠశాలలో రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు చెందిన 5 నుంచి 8 సంవత్సరాలలోపు వినికిడి లోపం గల బాల బాలికలు ఈ తరగతిలో చేరేందుకు అర్హులని తితిదే తెలిపింది. 
 
మే 18వ తేదీ వరకు తిరుపతిలోని బధిర పాఠశాల, కళాశాలలో ధరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. పూర్తి చేసిన ధరఖాస్తులను మే 20వ తేదీలోపు జూనియర్‌ కళాశాల, మే 25వతేదీ లోపు పాఠశాలలో అందజేయాలని శ్రవణం ప్రాజెక్టు అధికారులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి