వేసవి సీజన్‌లో ప్రయాణికుల రద్దీ నానాటికీ పెరిగిపోతుంది. దీంతో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులోభాగంగా, విజయవాడ మీదుగా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడిపేలా చర్యలు చేపట్టినట్టు రైల్వే అధికారులు తెలిపారు.
తిరుగు ప్రయాణంలో ఇదే రైలు మహబూబ్‌నగర్‌లో సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.50 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. ఈ రైలు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, మల్కాజ్‌గిరి, కాచిగూడ, జడ్చర్ల స్టేషన్లలో ఆగుతుంది.
తిరుగు ప్రయాణంలో ఇదే బండి తిరుపతిలో రాత్రి 9.55 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 10.15 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.
తిరుగు ప్రయాణంలో బెంగళూరులో మధ్యాహ్నం 3.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, కుప్పం, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతుంది.