ఇసైఙ్ఞాని ఇళయరాజా సంగీత విభావరి (లైవ్ కన్సర్ట్) పెద్ద ఎత్తున మొదటిసారి ఆంధ్రప్రదేశ్ లో జరగనుంది. విజయవాడ ఎంజి రోడ్ లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నవంబర్ 8వ తేదీ శనివారం నాడు కనీవినీ ఎరుగని రీతిలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. విజయవాడలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ట్రెండ్ సెట్టర్స్ లైవ్ సుధాకర్ ఈ లైవ్ కన్సర్ట్ ను నిర్వహిస్తున్నారు.
ఈ సంగీత కచ్చేరికి సంబంధించిన పోస్టర్ ను ఇసైఙ్ఞాని ఇళయరాజా తో పాటు, ఏపీ ఇండస్ట్రీస్ మినిస్టర్ టీజీ భరత్ విడుదల చేశారు. ఈవెంట్ కు సంబంధించిన టికెట్లను ఇప్పటికే బుక్ మై షో లో పొందుపరచగా మంచి రెస్పాన్స్ దక్కుతోంది. అత్యంత వేగంగా టికెట్లు అమ్ముడు అవుతున్నాయి. ఇంకా లిమిటెడ్ టికెట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్
ఈ సందర్భంగా ట్రెండ్ సెట్టర్స్ సుధాకర్ గారు మాట్లాడుతూ.. "సినీ సంగీతానికి జీవనాడిగా ఉన్న ఇళయరాజా గారితో కలిసి ఈ సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇళయరాజా గారు మొదటిసారి ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న లైవ్ కన్సర్ట్ కావడంతో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నాం. ఈ ఈవెంట్ కు సంబంధించిన టిక్కెట్లను బుక్ మై షో యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.