లగడపాటిపై పెప్పర్ స్ప్రే కేసును కొట్టివేసిన సుప్రీంకోర్టు

మంగళవారం, 9 మే 2017 (14:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో లోక్‌సభలో ఎంపీలపై పెప్పర్ స్ప్రే చల్లిన వ్యవహారం యావత్ భారతదేశాన్ని షాక్‌కు గురి చేసిన విషయం తెల్సిందే. దీనిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు.. మంగళవారం కొట్టివేసింది. 
 
నాటి లోక్‌సభ సమావేశాల్లో ఏపీ రాష్ట్ర విభజన బిల్లును నాటి యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టగా, అది ఏపీ ఎంపీలు, తెలంగాణ ఎంపీల మధ్య తీవ్ర ఘర్షణలకు దారితీసిన విషయం తెల్సిందే. ఒకరిపై మరొకరు భౌతిక దాడులకు పాల్పడే వరకు వెళ్లింది.
 
ఈ నేపథ్యంలో విజయవాడ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చల్లారు. దీంతో, తనపై పెప్పర్ స్ప్రేతో దాడి చేశారంటూ లగడపాటిపై పొన్నం ప్రభాకర్ కేసు వేశారు. ఈ కేసును మంగళవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. 

వెబ్దునియా పై చదవండి