శ్రీవారి ఆశీస్సులతో ఏపీని అభివృద్ధి చేస్తా : కేంద్ర రైల్వేశాఖామంత్రి సురేష్‌ ప్రభు

శనివారం, 4 జూన్ 2016 (11:41 IST)
తిరుమల శ్రీవారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని కేంద్ర రైల్వేశాఖామంత్రి సురేష్‌ ప్రభు తెలిపారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన విషయం తెల్సిందే. దీంతో ఆయన శనివారం శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. తిరుమల శ్రీవారిని విఐపి విరామ దర్శన సమయంలో కేంద్ర మంత్రి దర్శించుకున్నారు. ఆలయంలోని రంగనాయకమండపంలో శ్రీవారి తీర్థప్రసాదాలను రైల్వేమంత్రికి అందజేశారు. 
 
ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. ఏపీలో మొదటిసారి రైల్వే అభివృద్థిపై ఉన్నత స్థాయి సమావేశాన్ని విజయవాడలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుచానూరు క్రాసింగ్‌ స్టేషన్‌న్ ప్రారంభిస్తున్నామన్నారు. తిరుచానూరు క్రాసింగ్‌ స్టేషన్‌ వల్ల రైళ్ళు సమయానికి నడుస్తామని, ప్రయాణీకులు కూడా ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదన్నారు. 

వెబ్దునియా పై చదవండి