స్వరూపానందేంద్ర స్వామి చాతుర్మాస్య దీక్ష కోసం మే 15వ తేదీన ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి, వేద విద్యార్థులతో కలిసి విశాఖ నుంచి రిషికేష్ వెళ్ళారు. జూలై 24వ తేదీన ప్రారంభమైన చాతుర్మాస్య దీక్ష ఈనెల 20వ తేదీన ముగుస్తుంది. దీక్షా సమయాన్ని తపోకాలంగా పరిగణించి వేదాంత చింతనతో గడిపారు. రిషికేష్ తో పాటు హరిద్వార్ తదితర హిమాలయ పాద ప్రాంతాల్లో సంచరించారు. నిత్యం భగవద్గీత పారాయణ చేస్తూ జగద్గురు ఆదిశంకరాచార్యులు రచించిన ప్రస్థాన త్రయ భాష్య పాఠాలను వేద విద్యార్థులకు బోధించారు.