మా హెలికాఫ్టర్లను కూల్చే సీన్ ఐఎస్‌కు లేదు : రష్యా

బుధవారం, 25 మే 2016 (10:27 IST)
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల శక్తిసామర్థ్యాలపై రష్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రష్యా హెలికాఫ్టర్‌ను కూల్చివేసినట్టు ఐఎస్ ఉగ్రవాదులు చేసిన ప్రకటనపై రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కోనాషెంకోవ్ స్పందించారు. 
 
సిరియాలో ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ దాడిలో తమ దేశానికి చెందిన యుద్ధ హెలికాప్టర్లు, ట్రక్కులు తుక్కుతుక్కైపోయాయని వచ్చిన వార్తలు కేవలం ఊహాగానాలేనన్నారు. సిరియా బేస్‌లో తమ ఫైటర్ చాపర్లు, ట్రక్కులు పూర్తి భద్రంగా ఉన్నాయని, రోజూలాగానే ఉగ్రవాదులను ఏరివేసే పనిలో ఉన్నట్టు చెప్పారు. 
 
పైగా, తమ హెలికాఫ్టర్లను కూల్చివేసే సీన్ ఐఎస్‌కు లేదని, వారు ఎలాంటి దాడులు చేసే స్థితిలో లేరని, ఏ ఒక్క తమ సైనికుడికీ గాయాలు కాలేదని స్పెష్టం చేశారు. కాగా, సిరియా బేస్‌పై దాడి చేసిన ఐఎస్ఐఎస్ హెలికాప్టర్లను ధ్వంసం చేసిందని శాటిలైట్ చిత్రాలను చూపుతూ బీబీసీ వార్తా కథనాలను ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి