అసభ్య వ్యాఖ్యలు చేస్తున్న కొడాలి నానిపై చర్యలు తీసుకోండి: నిమ్మగడ్డ రమేశ్

గురువారం, 19 నవంబరు 2020 (15:02 IST)
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కు, వైసీపీ ప్రభుత్వానికి మధ్య భీకర పోరు జరుగుతున్నది. నిమ్మగడ్డ రమేశ్, వైసీపీ ప్రభుత్వం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమని మండుతోంది. తాజా ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ సిద్ధమవుతున్న సమయంలో నిమ్మగడ్డను వైసీపీ నేతలు మరోసారి టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రి కొడాలి నాని తనపై అసభ్యకర వార్తలను గుప్పిస్తున్నారని నిమ్మగడ్డ మండిపడ్డారు.
 
ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు నిమ్మగడ్డ ఓ లేఖ రాసారు. ఈ లేఖలో మంత్రి కొడాలి నానిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అందులో ఎన్నికల నిర్వహణపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారని, అసభ్యకర వార్తలతో తనను దూషించారని అందులో పేర్కొన్నారు.
 
ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా ఉద్యోగులను రెచ్చగొడుతున్నారని తెలిపారు. ఈసీని ఉద్దేశించి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు, పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్ వీడియోను గవర్నర్‌కు పంపారు. కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని అందులో తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు