తిరుమలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు అదృశ్యమయ్యారు. శనివారం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఆయన... దర్శనం ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో కనిపించకుండా పోయారు. దీంతో ఆందోళన చెందిన ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు.
కాగా శుక్రవారం తన మనుమడి పుట్టువెంట్రుకలను సమర్పించుకునేందుకు కుటుంబ సభ్యులు, వియ్యంకుడు చందా లింగయ్య కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లారు. శనివారం రాత్రి స్వామివారిని దర్శనం చేసుకున్న అనంతరం బయటకు వస్తుండగా.. తోపులాట జరిగింది.