దురదృష్టవశాత్తు తాను రనౌట్ అయ్యానని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర అన్నారు. ఆయన పదవీవిరమణ చేశారు. ఈసంర్భంగా సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు. మంత్రులు కడియం శ్రీహరి, కేటీఆర్, పోచారం శ్రీనివాసరెడ్డి, సీఎస్ ఎస్పీ సింగ్ తదితరులు హాజరై ప్రదీప్‌చంద్రను అభినందించారు.