దేవాలయానికి ఎవరైనా దేనికి వస్తారు? ప్రశాంతంగా దేముడికి నమస్కరించి, తమను కష్టాల గట్టెక్కించమని మొక్కుకుంటారు... మొక్కుబడులు చెల్లించుకుని, కరుణించమని దేముడిని వేడుకుంటారు. అసలే కరోనా కాలం. భౌతిక దూరాన్ని పాటిస్తూ, కరోనా నిబంధనలను పాటించాల్సింది పోయి... ఏకంగా భక్తులపైనే దాడికి దిగిన ఈ భద్రతా సిబ్బంది దుశ్చర్యలను మీరే చూడండి.
కరీంనగర్ జిల్లా వేములవాడ రాజన్న దేవాలయానికి దర్శనం కోసం వచ్చిన భక్తులపై సిబ్బంది ఇలా దాడి చేశారు. క్యూలైన్లను నియంత్రిస్తున్నామనే నెపంతో ఇలా సెక్యూరిటీ సిబ్బంది భక్తులపై దాడి చేసి భక్తులను మొక్కుబడులు చెల్లించనివ్వకుండా అరాచకంగా ప్రవర్తిస్తున్నారు. ఎదైనా ఆదుర్దాను భక్తులు ప్రదర్శిస్తే, వారికి సర్ది చెప్పాల్సింది పోయి, క్యూలైన్లను సరిచేయాల్సింది పోయి, ఇలా భక్తులపైనే తెగబడి, క్యూలైన్లలో చొరబడి మరీ బాదడం చూస్తూ, ఔరా కలియుగం అనిపించకమానదు.