నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం ఓ వివాహిత నిండు ప్రాణం బలితీసింది. ఈ ఘటన హైదరాబాద్, కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... కేపీహెచ్‌బీ రోడ్డు నం.2కు చెందిన పారిశ్రామికవేత్త అంజి రెడ్డికి ప్రత్యూష (26) అనే మహిళతో వివాహమైంది. వీరికి ఓ నాలుగేళ్ల కుమార్తె ఉంది. అయితే, వ్యాపార రీత్యా గత యేడాది అంజిరెడ్డి శ్రీలంకకు వెళ్లారు. దీంతో ప్రత్యూష ఇంటిపక్కనే ఉండే శ్రీనివాస్ అనే వ్యక్తితో చనువు ఏర్పిడి, వివాహేతర సంబంధానికి దారితీసింది.
స్వదేశం నుంచి తిరిగివచ్చిన అంజిరెడ్డికి భార్య వ్యవహారం తెలిసింది. దీంతో భార్యను మందలించడమే కాకుండా, ప్రవర్తన మార్చుకోవాల్సిందిగా ప్రత్యూషను కుటుంబ పెద్దలు హెచ్చరించినా.. ఆమోలో మార్పు రాలేదు. ఈ క్రమంలో మూడు నెలల క్రితం అంజిరెడ్డి, ప్రత్యూష మధ్య ఘర్షణ తీవ్రస్థాయిలో జరిగినట్లు తెలిసింది. దీంతో ఆమె తన కుమార్తెను తీసుకుని కూకట్‌పల్లి బాలాజీనగర్‌లో ఉండే శ్రీనివాస్ వద్దకు వచ్చింది. తాము భార్యాభర్తలమని ఇంటి యజమానిని నమ్మించి మూడు నెలలుగా అద్దె ఇంట్లో వారు కలిసి ఉంటున్నారు.
ఆమెను వివస్త్రను చేసి శరీరంతో పాటు.. గొంతులో కత్తితో పొడిచినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. కాగా, శ్రీనివాస్ పరారీలో ఉండటాన్ని బట్టి అతనే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతని కోసం గాలింపు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.