నడిరోడ్డుపై నరికేస్తా... ఎమ్మెల్యే వార్నింగ్, లోకేష్ ట్వీట్, ట్విట్టర్ బాంబర్ అంటూ...

శుక్రవారం, 28 జూన్ 2019 (20:36 IST)
వైసీపీకి చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సంబంధించిన ఓ ఆడియో టేపు సోషల్ మీడియాలో తీవ్ర సంచలనంగా మారింది. జర్నలిస్టుకి ఫోన్ చేసిన కోటంరెడ్డి... అసభ్య పదజాలంతో దూషిస్తూ నా కొ...కా నడిరోడ్డుపై నరికేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఆడియో టేపును తెదేపా నాయకుడు నారా లోకేష్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
 
ఆ ఆడియోలో... విలేకరిని కోటం రెడ్డి అసభ్యపదజాలంతో దూషిస్తూ... ‘‘నీ తోలు తీస్తా.. నీ దిక్కున్నచోట చెప్పుకో.. అంతా రికార్డు చేసుకో.. నిన్ను నడిరోడ్డుపై నరికేస్తా.. నిన్ను ఎవరు కాపాడతారా చూస్తా.. నీ ఇంటికే వస్తా, దమ్ముంటే టైమ్ చెప్పు, నా కొ...కా'' అంటూ విలేకరి శ్రీధర్ రెడ్డి విలేకరిని ఫోన్‌లో బెదిరిస్తూ మట్లాడారు. 
 
ఆ ఆడియో టేపు రికార్డును నారా లోకేష్ పోస్ట్ చేస్తూ... ఈ రాక్షస రాజ్యంలో జర్నలిస్టుల పరిస్థితి ఇదైతే ఇక సామాన్యుడి పరిస్ధితి ఎలా ఉండబోతోందో మీరే ఊహించుకోండి అని ట్వీట్ చేశారు.
 
ఐతే దీనిపై ఎమ్మెల్యే కోటంరెడ్డి తన వ్యక్తిగత ఫేస్ బుక్‌లో మాట్లాడుతూ... అది జరిగినదంతా ఎన్నికలకు ముందు అని వివరించారు. తనకు జర్నిలిస్టులు అంటే గౌరవం వుందన్నారు. ఐతే తను మాట్లాడింది జర్నిలిస్టుతో కాదనీ, ఓ జర్నలిస్టు ముసుగులో వున్న రాజకీయ దళారి అంటూ చెప్పారు. చూడండి ఆయన మాటల్లోనే...

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు