వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ఇదివరకే ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేసిన సంగతి తెలిసందే. కాల్ మనీ విషయంలో అసెంబ్లీలో రోజా వ్యవహరించిన తీరుపై ఆమెను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. అయితే తాజాగా అసెంబ్లీలో రోజా తోటి ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, దురుసుగా ప్రవర్తించారంటూ ఆమెపై మరోసారి సస్పెన్షన్‌కు ప్రివిలేజ్ కమిటీ సిద్ధమవడం చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే రోజాను ఏడాది పాటు అసెంబ్లీకి దూరం చేసిన ప్రభుత్వం మరోసారి కుట్రకు తెరలేపుతుందని మండిపడ్డారు. రోజా సస్పెన్షన్ పై న్యాయపోరాటం చేస్తామని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. అదే సమయంలో సీఎం చంద్రబాబు పాలనను ఆయన దుయ్యబట్టారు. కేంద్ర జీడీపీ కంటే రాష్ట్ర జీడీపీ ఎక్కువగా ఉందని చంద్రబాబు చెప్పడం ఆయన దిగుజారుడుతనానికి నిదర్శనమని అన్నారు.