29-07-2024 - సోమవారం మీ రాశి ఫలితాలు.. ఆకస్మిక నిర్ణయాలొద్దు..

రామన్

సోమవారం, 29 జులై 2024 (05:00 IST)
శ్రీ క్రోధినామ సం|| ఆషాఢ ఐ|| నవమి రా.8.41 భరణి ప.2.31 రా.వ.1.58 ల 3.29. ప.దు. 12.29 ల 1.21 పు.దు. 3.05 ల 3.57.
 
మేషం:– ఆర్ధిక విషయాలలో పురోభివృద్ధి. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు రాకుండా చూసుకొండి. చిన్నతరహా, చిరువృత్తుల వారికి సరైన తృప్తి లభిస్తుంది. మొండి బాకీల వసూళ్లు వంటి శుభ సంకేతాలున్నాయి. విదేశీయానం అనుకూలిస్తుంది. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆకస్మిక నిర్ణయాలు మంచిదికాదు.

వృషభం:- మీ సంతానం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. మీ మంచి తనమే మీకు శ్రీరామరక్ష. క్లిష్ట సమస్యలను ధైర్యంగా ఎదుర్కుంటారు. ఊహగానాలతో కాలం వ్యర్ధం చేసుకుండా సద్వినియోగం చేసుకోండి. స్త్రీలు షాపింగ్ దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. 
 
మిధునం:- రాజకీయ నాయకులకు ప్రయాణాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ చాలా అవసరం. సోదరీ, సోదరులతో ఏకీభవిచలేకపోతారు. మందులు, కిరణా, ఫ్యాన్సీ, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు బాగుగా కలిసిరాగలదు. స్థిరచరాస్తుల వ్యవహారాలు, మీ పాత సమస్యలు త్వరలోనే ఒక కొలిక్కివస్తాయి.
 
కర్కాటకం:- కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మీ సంతానం విద్య, వివాహ విషయాలపట్ల శ్రద్ధ వహిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళుకువ అవసరం. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి చికాకులు తప్పవు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. 
 
సింహం:- తలకు మించిన బాధ్యతలతో ఆరోగ్యం దెబ్బతింటుంది. జాగ్రత్త వహించండి. ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. గృహంలో మార్పులు చేర్పులు వాయిదాపడతాయి. స్త్రీలు టి.వి., ఛానల్స్ కార్యక్రమాలలోబాగా రాణిస్తారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు తిరిగి బలపడతాయి.
 
కన్య:- ఆర్ధిక లావాదేవీలు సంతృప్తిగా సాగుతాయి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల వ్యవహరాల పునరాలోన అవసరం. విదేశీయానం కోసం చేసే యత్నాలు కలిసివస్తాయి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు అనుకూలం. వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో వారికి మెళకువ అవసరం.
 
తుల:- బంధువుల రాకతో గృహంలో సందడి చోటు చేసుకుంటుంది. లౌక్యలంగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకుంటారు. దైవ కార్యక్రమాలలో చికాకులను ఎదుర్కుంటారు. సన్నిహితులతో కలిసి పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు.
 
వృశ్చికం:- ఆర్ధిక పరిస్థితి అనుకున్నంత సంతృప్తికరంగా ఉండదు. హోటల్, తినుబండా వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. కుటింబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకువస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. వృత్తుల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. ఉద్యోగస్తులు ఎంత శ్రమించినా గుర్తింపు లేక పోవడంతో ఆందోళనకు గురవుతారు.
 
ధనస్సు: తలకు మించిన బాధ్యతలతో ఆరోగ్యం దెబ్బతింటుంది. జాగ్రత్త వహించండి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల వ్యవహరాల పునరాలోన అవసరం. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి నిరంతర శ్రమ, ఓర్పు ఎంతో ముఖ్యం. మీ కుటుంబీకులకు ప్రతి విషయం తెలియజేయటం మంచిది.
 
మకరం: ఆర్ధికంగా నిలదొక్కుకుంటారు. స్త్రీలు టి.వి., ఛానల్స్ కార్యక్రమాలలో బాగా రాణిస్తారు. రహస్య విరోధులు అధికం కావడంవల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. మీ అజాగ్రత్త వల్ల గృహంలో విలువైన వస్తువును చేజార్చుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణల విషయంలోఒక నిర్ణయానికి వస్తారు.
 
కుంభం:- తలపెట్టిన పనులు త్వరతగతిన పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు తలెత్తె ఆస్కారం ఉంది మెళకువ వహించండి. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. స్త్రీలకు నరాలు, దంతాలు, ఎముకలకు సంబంధించిన చికాకు లెదుర్కోవలసివస్తుంది.
 
మీనం:- ఆర్ధికంగా ఎదగటానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి రాగలవు. బంధుమిత్రుల రాకతో నూతన ఉత్సాహం కానవస్తుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు తిరిగి బలపడతాయి. వస్త్ర, ఫ్యాన్సీ, మందులు, పచారీ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు