30-05-2025 శుక్రవారం దినఫలితాలు - ప్రయాణంలో ఇబ్బందులు తప్పవు...

రామన్

శుక్రవారం, 30 మే 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆత్మస్థైర్యంతో యత్నాలు సాగిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. స్థిరాస్తి ధనం అందుతుంది. నగదు స్వీకరణలో జాగ్రత్త. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఏకాగ్రతతో వాహనం నడపండి. ప్రయాణంలో అవస్థలు ఎదుర్కుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆర్ధికలావాదేవీలు కొలిక్కివస్తాయి. రావలసిన ధనం అందుతుంది. రుణసమస్యల నుంచి విముక్తులవుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. కొత్త పనులు చేపడతారు. బాధ్యతలు అప్పగించవద్దు. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలను ఖర్చులు విపరీతం. అందరితోనూ మితంగా సంభాషించండి. పనులు పురమాయించవద్దు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. వేడుకకు హాజరవుతారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
కార్యసిద్ధికి సంకల్ప బలం ముఖ్యం. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సంయమనం పాటించండి. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఆచితూచి అడుగేయండి. నోటీసులు అందుకుంటారు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
నిర్విరామంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పనులు, బాధ్యతలు పురమాయించవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
పట్టుదలతో శ్రమిస్తే విజయం సాధ్యం. మీ సామర్ధంపై నమ్మకం పెంచుకోండి. సాయం ఆశించవద్దు. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం గ్రహిస్తారు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. పత్రాల రెన్యువల్ అశ్రద్ధ చేయకండి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి.. ఆర్భాటాకు విపరీతంగా ఖర్చుచేస్తారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. మీ సామర్ధ్యంపై ధైర్యం కలుగుతుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యసాధనకు సంకల్పబలం ముఖ్యం. ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. అవకాశాలను వదులుకోవద్దు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. కీలక వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహారాలతో తీరిక ఉండదు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. ఆచితూచి అడుగువేయండి. సన్నిహితులను కలుసుకుంటారు. ధార్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ప్రతికూలతలను ధైర్యంగా ఎదుర్కుంటారు. యత్నాలకు పెద్దల ఆశీస్సులుంటాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనుల్లో ఒత్తిడి అధికం. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. మాట నిలబెట్టుకుంటారు. ప్రముఖులతో సంభాషిస్తారు. ఆశించిన ఆశించిన పదవులు దక్కవు. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. మొండిగా పనులు పూర్తి చేస్తారు. విలాసాలకు ఖర్చు చేస్తారు. ప్రయాణం తలపెడతారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యసిద్ధికి ఓర్పుతో శ్రమించండి. సాయం ఆశించవద్దు. ముందుచూపుతో వ్యవహరించండి. ఊహించని ఖర్చు ఆందోళన కలిగిస్తుంది. ఆలోచనలతో సతమతమవుతారు. ఆత్మీయులను కలుసుకుంటారు. పనులు ఒక పట్టాన సాగవు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు