ఎర్రచందనంతో చర్మ ఆరోగ్యం... ఇలా చేస్తే మెరిసిపోతారు..

సోమవారం, 26 డిశెంబరు 2022 (17:40 IST)
Red sandal
ఎర్రచందనం చర్మానికి కావాల్సిన అన్ని పోషకాలతో సమృద్ధిగా అందిస్తుంది. కాబట్టి ఎర్రచందాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ లా వేసుకుంటే.. అనేక చర్మ సమస్యలను నివారించుకోవచ్చు. రెండు టీస్పూన్ల ఎర్రచందనం పొడిని నీళ్లతో కలిపి పేస్ట్‌లా చేసి, దానిని ముఖం, చేతులు పాదాలకు ప్రతిరోజూ రాసుకుంటే చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది.
 
అలాగే ఒక గిన్నెలో 2 టీస్పూన్ల పెరుగు లేదా పాలు పోసి అందులో 1 టీస్పూన్ ఎర్రచందనం పొడి, 1/2 టీస్పూన్ పసుపు కలిపి ముఖానికి పట్టించి 1/2 గంట నానబెట్టి కడిగేయాలి. ఇలా చేస్తే చర్మం కోమలంగా తయారవుతుంది. కాంతితో పుంజుకుంటుంది. దానికి 4 టీస్పూన్ల కొబ్బరి పాలు, 2 టీస్పూన్ల బాదం నూనె, 4 టీస్పూన్ల గంధం పొడి కలిపి రోజూ ముఖానికి రాసుకుంటే చర్మంపై మచ్చలు త్వరగా మాయమవుతాయి. మొటిమలు తొలగిపోతాయి. 
 
ఇంకా 1 టీస్పూన్ ఎర్రచందనం పొడిని 1 నిమ్మకాయ రసంలో కలిపి ముఖానికి రాసుకుని కాసేపు నానబెట్టి తర్వాత కడిగేయాలి. ఇది చర్మ రంధ్రాలను బిగుతుగా చేసి జిడ్డును తొలగిస్తుంది. ఎర్రచందనం పొడిని నీళ్లలో లేదా రోజ్ వాటర్‌తో కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి పట్టించి కడిగేసుకుంటే ముఖం బిగుతుగా తయారవుతుంది. ముడతలు తొలగిపోతాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు