అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందిః ఒబామా

శనివారం, 1 మే 2010 (11:48 IST)
FILE
గతంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం అమెరికాలో కాస్త తగ్గుముఖం పడుతోందని, దీంతో తమ దేశీయ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని అమెరికా అధ్యక్షుడు ఒబామా వాషింగ్టన్‌లో తెలిపారు.

తమ ప్రభుత్వం ఆర్థికంగా పుంజుకుంటోందని, దీంతో కొత్త మార్గంలో పయనించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఏడాది ముందు దేశంలో పలువురు ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారని, మరికొందరు నిరాశ్రయులైనారని, దీనికంతటికి ప్రధాన కారణం ఆర్థికమాంద్యమేనన్నారు. కాని ప్రస్తుతం తమ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తోందని, నిరాశ్రయులకు అండగా నిలుస్తోందన్నారు.

మన దేశం మందుకు దూసుకువెళుతోందని, ఆర్థికంగా పురోగతిని సాధిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఆర్థికంగా వృద్ధిని సాధిస్తుండటంతో దేశీయ కుటీర పరిశ్రమలు గాడిన పడుతున్నాయని ఆయన అన్నారు. దీంతో మరిన్ని ఉద్యోగావకాశాలు లభించే అవకాశాలున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదిలావుండగా అమెరికా కుటీర పరిశ్రమలు, లఘు పరిశ్రమలలో ఉత్పత్తుల్లో 2.3 శాతం మేరకు వృద్ధి సాధించిందని అమెరికా వాణిజ్యమంత్రిత్వ శాఖ ఇటీవలే ప్రకటించింది. అదే నిరుడు ఇదే కాలానికి దేశీయ కుటీర పరిశ్రమల ఉత్పత్తుల్లో సున్నా నుంచి మైనస్ 6.4 శాతానికి తక్కుగానే ఉండిందని ఆ విభాగం తెలిపింది.

వెబ్దునియా పై చదవండి