అంతేకాదు, జులై 2014 నుంచి ఆగస్ట్ 2015 లోపు బ్యాంకు ఖాతా తెరిచిన వారు ఆధార్ వివరాలతో పాటు కేవైసీ వివరాలను కూడా సదరు బ్యాంకుకు సమర్పించాలని సూచించింది. విదేశీ పన్నుల అమలు చట్టానికి లోబడి ఖాతాదారులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఐటీ శాఖ కోరింది.
ఈ డెడ్‌లైన్‌కు లోబడి అందరూ వివరాలు సమర్పించాలని లేని పక్షంలో ఖాతాను బ్లాక్ చేస్తామని, ఆ తర్వాత ఖాతా నుంచి ఎటువంటి లావాదేవీలకు అవకాశం ఉండదని ఐటీ శాఖ తేల్చి చెప్పింది. సదరు బ్యాంకులు కూడా ఈ మేరకు ఖాతాదారులను అప్రమత్తం చేయాలని సూచించింది. ఐటీ శాఖ నిర్ణయానికి కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం.