భారత మార్కెట్లోకి ఆడి క్యూ3.. రూ.2లక్షలతో బుక్ చేసుకోవచ్చు

శుక్రవారం, 12 ఆగస్టు 2022 (14:23 IST)
Audi Q3
ఆడి నుంచి కారు ప్రియులకు శుభవార్త. జర్మన్ కార్‌మేకర్ ఆడి భారతదేశంలో 2022 ఆడి క్యూ3 మోడల్ కోసం ప్రీ-బుకింగ్స్ ఓపెన్ చేసింది. ఈ కారును రెండు లక్షల రూపాయలతో బుక్ చేసుకోవచ్చు. ఈ కారు "క్వాట్రో" ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. దీనిని బ్రాండ్ డీలర్‌షిప్‌ల ద్వారా లేదా "myAudi Connect" యాప్ ద్వారా బుక్​ చేసుకోవచ్చు.
 
Audi Q3 ఫీచర్లు
SUV మ్యాట్రిక్స్ LED హెడ్‌లైట్లు, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది. 
2022 ఆడి క్యూ3 మస్కులర్ బానెట్, 
ఇంటిగ్రేటెడ్ DRLలతో కూడిన సొగసైన మ్యాట్రిక్స్ LED హెడ్‌లైట్‌లు, 
విశాలమైన ఎయిర్ డ్యామ్‌ను కలిగి ఉంది.
 
కారు లోపల ఆడి క్యూ3 రిఫ్రెష్డ్ డాష్‌బోర్డ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 15-స్పీకర్ సోనోస్ ఆడియో సిస్టమ్, తాజా కనెక్టివిటీ ఎంపికలతో 10.1-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్‌ను ప్యాక్ చేస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు