సామాన్య ప్రజల సొంతింటి కల నెరవేరేనా? పెరిగిన సిమెంట్ ధరలు
గురువారం, 28 సెప్టెంబరు 2023 (18:11 IST)
సామాన్య ప్రజల సొంతింటి కల నెరవేరేలా కనిపించట్లేదు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా సిమెంట్ ధరలు పెరిగిపోతున్నాయి. ఈ సిమెంట్ ధరల పెరుగుదల కారణంగా సొంతింటి నిర్మాణం కోసం ఖర్చు భారీగా చేయాల్సి వుంటుంది.
ఈ పెరుగుదల కారణంగా భారతదేశం మొత్తం సిమెంట్ సగటు ధర 50 కిలోల బస్తా రూ.382కి చేరుకుంది. ఈశాన్య రాష్ట్రాల్లో సిమెంట్ బస్తా ధర రూ.400కి చేరింది.
వర్షాకాలంలో సిమెంట్ ధరకు డిమాండ్ తగ్గినా.. సెప్టెంబర్ త్రైమాసికంలో డిమాండ్ కారణంతో ధరలు పెరిగాయి. అలాగే రుతుపవనాలు పెరిగే సరికి సిమెంట్ ధరలు మరింత పెరిగే అవకాశం వుంది.