కెనరా బ్యాంకుకు చుక్కలు.. జెట్ ఎయిర్‌వేస్ చీఫ్ నరేశ్ గోయల్‌ అరెస్ట్

శనివారం, 2 సెప్టెంబరు 2023 (11:44 IST)
Naresh Goyal
జెట్ ఎయిర్‌వేస్‌కు కష్టమొచ్చింది. కెనరా బ్యాంకును మోసగించినందుకు మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్‌ను అరెస్ట్ చేశారు. కెనరా బ్యాంకుకు చెందిన రూ.538 కోట్ల నిధులు స్వలాభానికి పక్కదారి పట్టించినట్టు గోయెల్‌పై ఆరోపణలు వున్నాయి. 
 
ఈ నేపథ్యంలో గోయెల్‌ను ముంబైలోని ఈడీ ఆఫీసులో సుదీర్ఘంగా విచారించిన అధికారులు చివరకు ఆయనను ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద అదుపులోకి తీసుకున్నారు. 
 
ఇకపోతే.. శనివారం అధికారులు నరేశ్ గోయల్‌ను నగరంలోని పీఎమ్ఎల్ఏ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. గోయల్ కస్టోడియల్ రిమాండ్‌ను ఈడీ కోరే అవకాశం వుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు