అమేజాన్ ఎక్స్ పీరియెన్స్ అరేనాతో పండగలు సంబరం చేయడానికి సిద్ధమైన హైదరాబాద్

శనివారం, 28 అక్టోబరు 2023 (14:41 IST)
టెలివిజన్స్‌లో తెలంగాణా గణనీయంగా 2x వృద్ధిని చూపించిందని Amazon ప్రకటించింది. పండగల సమయంలో 60%కి పైగా 5జీ స్మార్ట్ ఫోన్స్ విక్రయించబడి అమేజాన్ ఇండియా కోసం టీవీ మరియు స్మార్ట్ ఫోన్ శ్రేణులలో ఈ ప్రాంతం ప్రముఖంగా నిలిచింది. నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆర్థిక పథకాలు ద్వారా ప్రోత్సహించబడి, ప్రీమియం స్మార్ట్ ఫోన్స్, పెద్ద-స్క్రీన్ టెలివిజన్స్‌ను ఎంచుకునే కస్టమర్ల సంఖ్యలో రాష్ట్రం ప్రముఖ ప్రాంతాలలో ఒకటిగా నిలిచింది.
 
అక్టోబర్ 26న ‘అమేజాన్ ఎక్స్ పీరియెన్స్ ఎరీనా’ (ఏఎక్స్ఏ)తో హైదరాబాదులో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023ను కూడా హైదరాబాద్ లోని కస్టమర్స్‌కు అవకాశం కలిగింది. ఈ విలక్షణమైన షోకేస్ తమకు ఇష్టమైన బ్రాండ్స్, ఉత్పత్తులను అనుభవించడానికి, వినోదాత్మక కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశాన్ని మీడియా, ఇన్‌ఫ్లూయెన్సర్స్, కస్టమర్స్‌కు కలిగించింది. కార్యక్రమంలో ఏడు ఇంటరాక్టివ్ జోన్స్‌లో, ఉత్తేజభరితమైన బహుమతులు గెలవడానికి కస్టమర్స్ పోటీపడ్డారు. తమ ప్రముఖ బ్రాండ్స్‌కు చెందిన శ్రేణిలను పరిశీలించే అవకాశం కూడా కలిగింది.
 
ఈ సందర్భంగా, అమెజాన్ ఇండియా స్మార్ట్ ఫోన్స్ అండ్ టెలివిజన్స్ డైరెక్టర్ రంజిత్ బాబు ఇలా అన్నారు, “హైదరాబాద్‌లో మా కస్టమర్‌లకు అమెజాన్  ఎక్స్‌పీరియెన్స్ ఎరీనాను పరిచయం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. నవాబ్స్ నగరం స్మార్ట్ ఫోన్  మరియు టెలివిజన్ విభాగంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న మెట్రోలలో ఒకటిగా నిలిచింది. తెలంగాణ ప్రజలు పండుగల సీజన్‌లో భారతదేశంలో అత్యంత ఇష్టపడే, విశ్వసనీయమైన మరియు అభిమానించే ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లో తమ అభిమాన ఉత్పత్తుల కోసం షాపింగ్ చేయడం కొనసాగిస్తుడటం వలన, ఈ ప్రాంతంలో కొనసాగుతున్న అభివృద్ధిని చూసి మేము గర్విస్తున్నాము. ప్రీమియం స్మార్ట్ ఫోన్‌లు మరియు టెలివిజన్‌ల పై కస్టమర్  ప్రాధాన్యత పెరుగుతుండటం వలన, మేము అమెజాన్ ఇండియాలో నో కాస్ట్ ఈఎంఐ, బ్యాంక్ డిస్కౌంట్‌లు, Apay రివార్డ్స్, క్యాష్‌బ్యాక్ మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో పాటు ఉత్తమమైన ఉత్పత్తుల శ్రేణి వంటి ఆకర్షణీయమైన సరసమైన ఎంపికలను అన్ని ప్రధాన బ్రాండ్ల నుండి అందిస్తూనే ఉన్నాము.”

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు