ప్రపంచంలో ఇతర దేశాల కంటే భారత్ వేగంగా డిజిటైజేషన్‌తో మమేకమవుతోందని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) పేర్కొంది. రోజూ 110 కోట్ల జీబీ డేటా ట్రాఫిక్, 220 కోట్ల వాయిస్, వీడియో నిమిషాలతో ప్రపంచంలోనే జియో అతి పెద్ద నెట్‌వర్క్‌గా అవతరించింది, మొబైల్ డేటా వినియోగంలో భారత్‌ను ఇతర దేశాల కంటే ముందంజలో నిలిపింద’’ని పేర్కొంది. జియోకు మార్చి 31 నాటికి 10 కోట్ల 80 లక్షల మంది చందాదారులు ఉన్నారని, ఈ సంఖ్య మరింత పెరుగుతోందని వెల్లడించింది.