భారత్‌లోని ఫ్రెండ్స్‌కు విజయ్ మాల్యా ఖరీదైన మద్యం బహుమతి...

ఆదివారం, 30 అక్టోబరు 2016 (14:53 IST)
భారతీయ బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న లిక్కర్ డాన్ విజయ్ మాల్యా. ఈయన దీపావళి పండుకకు భారత్‌లోని తన స్నేహితులకు భారీ బహుమతులు పంపించినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
యూబీ గ్రూప్ లోగోతో కూడిన అందమైన బాక్సులో ఖరీదైన బ్లాక్ లేబుల్ మద్యం బాటిల్‌ను భారత్‌కు పార్శిల్స్ చేశాడు. మాల్యా పంపిన ఈ బహుమతులు దేశంలోని పలువురికి అందినట్టు సమాచారం. ఎన్నిసార్లు కోర్టులు ఆదేశించినా భారత్‌కు రావడానికి మాల్యా సంసిద్ధతను వ్యక్తం చేయడం లేదన్న సంగతి తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి