నాణ్యమైన డయాగ్నోస్టిక్ సేవలతో పాటుగా నివారణ ఆరోగ్య సంరక్షణ సేవలను విస్తరించాలనే తమ ప్రయత్నంలో భాగంగా దక్షిణ భారతదేశంలో అతిపెద్ద వైద్య నిర్ధారణ పరీక్షల సేవా ప్రదాతలలో ఒకటైన మెడాల్ నేడు దక్షిణ భారతదేశ వ్యాప్తంగా విస్తరించేందుకు తమ ప్రణాళికలను వెల్లడించింది. తమిళనాడులో టియర్ 2 మరియు టియర్ 3 నగరాలలో మరింత విస్తృతంగా చేరుకోవడంతో పాటుగా మెడాల్ ఇప్పుడు ఇతర దక్షిణ భారత రాష్ట్రాలైన కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేరళలలో కూడా విస్తరించనుంది.
ఫ్రాంచైజీ నమూనాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కేంద్రాలు బహుళ నమూనాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో సేకరణ కేంద్రాలు, మినీ వెల్‌నెస్ కేంద్రాలు, ఫుల్ సర్వీస్ కేంద్రాలు, ల్యాబ్ కలెక్షన్ కేంద్రాలు మరియు మెడాల్ కేర్ కేంద్రాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో దక్షిణ భారతదేశ వ్యాప్తంగా 300-400 కేంద్రాలను తెరిచేందుకు మెడాల్ ప్రణాళిక చేసింది.
ఈ విస్తరణ గురించి మెడాల్ సీఈఓ అర్జున్ అనంత్ మాట్లాడుతూ కోవిడ్ 19 కేసులు పెరుగుతున్న వేళ, గతానికన్నా మిన్నగా నివారణ ఆరోగ్య సంరక్షణ ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారు. దక్షిణ భారతదేశ వ్యాప్తంగా విస్తరించడం ద్వారా, ప్రస్తుత వైరస్‌తో పాటుగా ఇతర సమస్యల నివారణకు వీలుగా అత్యుత్తమ శ్రేణి డయాగ్నోస్టిక్ మరియు నివారణ ఆరోగ్య సంరక్షణ సేవలను అందించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము అని అన్నారు.
ఫ్రాంచైజీ నమూనాలో వెళ్లాలని నిర్ణయించుకున్న వేళ, మేము వ్యాపారావకాశాలను అందించనున్నాము. మరీముఖ్యంగా మహిళలకు తమ సొంత మరియు ప్రపంచ శ్రేణి డయాగ్నోస్టిక్ సేవలు నిర్వహించే వీలు కల్పించడంతో పాటుగా సంరక్షణ మరియు కరుణతో వైద్య సేవలను అందించే అవకాశమూ అందిస్తున్నాము. మెడాల్ యొక్క ఫ్రాంచైజీ మోడల్ ఇప్పుడు వ్యాపారవేత్తలకు ఆరోగ్య సంరక్షణ రంగంలో ప్రవేశించేందుకు తగిన అవకాశాలనూ కల్పించనుంది అర్జున్ అన్నారు.