మహీంద్రా ఎలక్ట్రిక్ ఆరిజిన్ ఎస్‌యూవీల కోసం శాంసంగ్ వాలెట్‌లో డిజిటల్ కార్ కీ సదుపాయం

ఐవీఆర్

బుధవారం, 29 అక్టోబరు 2025 (22:38 IST)
భారతదేశపు అతిపెద్ద కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన శాంసంగ్, ఈ రోజు శాంసంగ్ వాలెట్ ద్వారా మహీంద్రా ఎలక్ట్రిక్ ఆరిజిన్ ఎస్‌యూవీల కోసం డిజిటల్ కార్ కీ సదుపాయాన్ని (కంపాటిబిలిటీ) అందిస్తున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా మరింతమంది కార్ల యజమానులు తమ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించి తమ వాహనాలను అన్‌లాక్ చేయడానికి, లాక్ చేయడానికి, స్టార్ట్ చేయడానికి ఒక సజావైన మార్గాన్ని పొందవచ్చు.
 
నేరుగా గెలాక్సీ పరికరాలలో(డివైసెస్‌లో) ఇమిడిపోయే(ఇంటిగ్రేటెడ్) శాంసంగ్ వాలెట్ డిజిటల్ కార్ కీ, భౌతికమైన కీ(ఫిజికల్ కీ) అవసరం లేకుండానే జత చేసిన వాహనాన్ని లాక్, అన్‌లాక్, స్టార్ట్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. అంతేకాకుండా, వినియోగదారులు తమ డిజిటల్ కార్ కీని స్నేహితులు, కుటుంబ సభ్యులతో పరిమిత కాలానికి పంచుకోవచ్చు(షేర్ చేయవచ్చు), అవసరమైనప్పుడు యాక్సెస్‌ను నిర్వహించవచ్చు.
 
శాంసంగ్ వాలెట్ ద్వారా మహీంద్రా ఇ-ఎస్‌యూవీ యజమానులకు శాంసంగ్ డిజిటల్ కీ యొక్క అద్భుతమైన సౌలభ్యాన్ని తీసుకురావడం మాకు చాలా ఉత్సాహంగా ఉంది. శాంసంగ్ డిజిటల్ కార్ కీ యాక్సెస్‌ను విస్తరించడం అనేది, గెలాక్సీ ఎకోసిస్టమ్‌లో కనెక్ట్ అయిన, సురక్షితమైన అనుభవాలను అందించాలన్న మా నిబద్ధతలో ఒక ముఖ్యమైన భాగం. డ్రైవింగ్ వంటి రోజువారీ కార్యకలాపాలను మరింత మంది గెలాక్సీ వినియోగదారులకు అవాంతరాలు లేకుండా మార్చడంలో మహీంద్రాతో మా భాగస్వామ్యం మరో ఉత్తేజకరమైన ముందడుగు అని శాంసంగ్ ఇండియా, సర్వీసెస్- యాప్స్ బిజినెస్ సీనియర్ డైరెక్టర్ మధుర్ చతుర్వేది అన్నారు.
 
మహీంద్రా-మహీంద్రా లిమిటెడ్, ఆటోమోటివ్ డివిజన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నళినీకాంత్ గొల్లగుంట మాట్లాడుతూ, మా ఎలక్ట్రిక్ ఆరిజిన్ ఎస్‌యూవీలు XEV 9e, BE 6 వాటి అధునాతన సాంకేతికత, ఫ్యూచరిస్టిక్ డిజైన్లతో మా కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శాంసంగ్ వాలెట్ ద్వారా డిజిటల్ కార్ కీ అనే మరో ఫస్ట్-ఇన్-క్లాస్ ఫీచర్‌ను అందించడానికి శాంసంగ్‌తో భాగస్వామ్యం కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రతి ప్రయాణాన్ని మరింత సజావైన, సౌకర్యవంతంగా నిర్ధారిస్తుంది. భారతదేశం కోసం ప్రీమియం, ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలతో అసాధారణమైన ఓనర్‌షిప్ అనుభవాన్ని అందించాలన్న మహీంద్రా నిబద్ధతకు ఈ తాజా ఆవిష్కరణ మరో ఉదాహరణగా నిలుస్తుంది.
 
ఒకవేళ డిజిటల్ కార్ కీ ఉన్న డివైస్ పోయినా లేదా దొంగిలించబడినా, వినియోగదారులు శాంసంగ్ ఫైండ్ (Samsung Find) సేవ ద్వారా రిమోట్‌గా తమ డివైస్ లాక్ చేయవచ్చు లేదా డిజిటల్ కార్ కీతో సహా తమ డేటాను తొలగించవచ్చు, తద్వారా తమ వాహనాలకు మరింత భద్రత కల్పించుకోవచ్చు. బయోమెట్రిక్ లేదా పిన్ ఆధారిత యూజర్ అథెంటికేషన్ అవసరాలతో, శాంసంగ్ వాలెట్ వాహనాన్ని రక్షిస్తుంది, ప్రతి ఇంటరాక్షన్‌తో గోప్యతను, భద్రతను నిర్ధారిస్తుంది.
 
శాంసంగ్ వాలెట్ అనేది ఒక బహుముఖ ప్లాట్‌ఫామ్. ఇది గెలాక్సీ వినియోగదారులు తమ డిజిటల్ కీలు, చెల్లింపు పద్ధతులు(పేమెంట్ మెథడ్స్), గుర్తింపు కార్డులు(ఐడెంటిఫికేషన్ కార్డ్స్), మరిన్నింటిని ఒకే సురక్షితమైన అప్లికేషన్‌లో నిర్వహించుకోవడానికి అనుమతిస్తుంది. శాంసంగ్ వాలెట్ శాంసంగ్ నాక్స్(Samsung Knox) అందించే డిఫెన్స్-గ్రేడ్ సెక్యూరిటీ ద్వారా రక్షించబడిన సజావైన ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంది. ఇది గెలాక్సీ ఎకోసిస్టమ్‌తో ఏకీకృతమై(ఇంటిగ్రేట్ అయి), వినియోగదారులకు వారి రోజువారీ జీవితంలో శక్తివంతమైన కనెక్టివిటీని, పటిష్టమైన భద్రతను అందిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు