నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ రైలులో పాము.. బెంబేలెత్తిపోయిన ప్రయాణీకులు

శుక్రవారం, 29 జులై 2022 (14:06 IST)
తిరువనంతపురం నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో పాము కనిపించడంతో ప్రయాణీకులు భయంతో బెంబేలెత్తిపోయారు. కేరళలోని కోజికోడ్ స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. పామును పట్టుకునేందుకు రైలును దాదాపు గంటపాటు నిలిపివేశారు. 
 
రైలు తిరూర్ నుంచి బయలుదేరిన కాసేపటికే ఎస్ 5 బోగీలో బెర్త్ కింద లగేజీ మధ్యలో పాము కనిపించడంతో ప్రయాణికులు హడలిపోయారు. స్టేషన్‌లో రైలు ఆగగానే ప్రయాణికులు కిందికి దిగిపోయారు. 
 
పాములు పట్టే వారితో బోగీని వెతికించారు. గంటపాటు వెతికినా దాని జాడ కనిపించకపోవడంతో అది బయటకు వెళ్లిపోయి ఉంటుందని నిర్ధారించారు. పాము ఓ రంధ్రం గుండా బయటకు వెళ్లిపోయి ఉండొచ్చని భావించిన అధికారులు దానిని మూసివేశారు. అనంతరం రైలు తిరిగి బయలుదేరింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు