ఆంధ్ర విమాన ప్రయాణికులకు శుభవార్త: ప్రత్యేక విమాన సర్వీసులు

ఆదివారం, 3 జనవరి 2021 (11:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విమాన ప్రయాణికులకు ఓ శుభవార్త. సంక్రాంతి పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని విజయవాడ గన్నవరం నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమాన సర్వీసులు నడుపనున్నారు. ప్రైవేట్ విమానయాన సంస్థ స్పైస్ జెట్ ఈ విమాన సర్వీసులను నడుపనుంది. 
 
ఈ సర్వీసులు ఈ నెల 10 నుంచి 31 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. పదో తేదీ నుంచి 31 వరకు ప్రతి రోజు సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్‌లో విమానం బయలుదేరి 5.30 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. అదే విమానం తిరిగి 6 గంటలకు బయలుదేరి రాత్రి 7.10 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
 
ఇకపోతే, 11వ తేదీ నుంచి 28 వరకు మరో కొత్త సర్వీసు అందుబాటులోకి వస్తుంది. ఈ విమానం విజయవాడలో మధ్యాహ్నం 3.20 గంటలకు బయలుదేరి 4.10 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. 16 నుంచి 30 వరకు మరో విమాన సర్వీసు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. ఇది మధ్యాహ్నం 3.20 గంటలకు విజయవాడలో బయలుదేరి 3.55 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుందని స్పైస్‌జెట్ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు