పదివేల కోట్ల రూపాయలకు ఏయుఎంను రెట్టింపు చేయడమే లక్ష్యం: యూనియన్‌ ఏఎంసీ

శుక్రవారం, 8 జనవరి 2021 (22:54 IST)
యునియున్‌ ఏఎంసీ నేడు తమ వృద్ధి వ్యూహాన్ని వెల్లడించడంతో పాటుగా తమ ఏయుఎం (నిర్వహణలోని ఆస్తులు)ను 10వేల కోట్ల రూపాయలకు బీ30 నగరాల నుంచి వచ్చే వృద్ధితో రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది.
 
యునియన్‌ ఏఎంసీ గత కొద్ది సంవత్సరాలుగా గణనీయమైన మార్పులను తమ కార్యకలాపాల పరంగా చూడటంతో పాటుగా యాజమాన్య పరంగా అత్యధిక వృద్ధి సాధించేందుకు  సిద్ధంగా ఉంది మరియు దాని కొత్త అవతార్‌ లేదా వెర్షన్‌ 2.0తో కనిపిస్తోంది. ఈ సంస్థను సుప్రసిద్ధ భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ యునియన్‌ బ్యాంక్‌ మరియు సుప్రసిద్ధ జపనీస్‌ ఫారిన్‌ ఫైనాన్షియల్‌ సంస్థ దాయ్-చీ లైఫ్‌ హోల్డింగ్స్‌, ఐఎన్‌సీలు కో-స్పాన్సర్‌ చేస్తున్నాయి.
 
శ్రీ ప్రదీప్‌కుమార్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈవో), యునియన్‌ ఎస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాట్లాడుతూ, ‘‘ఈ ఏఎంసీ మరింత బలమైన పెట్టుబడి విధానాన్ని అమలు చేయడం వల్ల పలు యునియన్‌ ఏఎంసీ యొక్క పథకాలు మరింతగా మెరుగుపడుతాయి. ఎఫ్‌పీఐ మార్గంలో ఈ కంపెనీ దాయ్‌ చీ కోసం పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తోంది. 2020వ సంవత్సరంలో ఆంధ్రాబ్యాంక్‌, కార్పోరేషన్‌ బ్యాంక్‌లు యునియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో విలీనమయ్యాయి. ఈ విలీన సంస్ధకు ఇప్పుడు శాఖల పరంగా మరిన్ని వనరులు అందుబాటులో రావడం వల్ల వృద్ధి వ్యూహం అమలు కావడంలో సహాయపడుతుంది.
 
రిటైల్‌ ఇన్వెస్టర్లు మరియు బీ30 నగరాల నుంచి యునియన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఏయుఎంకు తోడ్పాటు చక్కగా ఉంది. నవంబర్‌2020లో మా సరాసరి ఏయుఎంలో 39% వాటా బీ30 నగరాల నుంచి ఉంది. పరిశ్రమలో వినూత్నమైన మదుపరుల మార్కెట్‌ వాటా పరంగా 1% కలిగి ఉన్నాము. నిబద్ధత, వనరులతో కూడిన స్పాన్సర్లతో పాటుగా నూతన   సీఐఓ, విస్తృతస్థాయి పెట్టుబడి ప్రక్రియలతో స్థిరమైన రాబడులను లక్ష్యంగా చేసుకోవడంతో పాటుగా దూకుడుతో కూడిన అమ్మకాలు, మార్కెటింగ్‌ వ్యూహాలతో ప్రస్తుత మా ఏఎయుంను ఈ సంవత్సర కాలంలో రెట్టింపు చేయడాన్ని లక్ష్యంగా చేసుకున్నాము’’ అని అన్నారు.
 
ఇటీవలనే, యూనియన్‌ బ్యాంక్‌ కాకుండా మ్యూచువల్‌ ఫండ్‌ పంపిణీదారుల ద్వారా వ్యాపారాన్ని నడిపించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. యునియన్‌ ఏఎంసీ వద్ద పూర్తిగా అంకితం చేయబడిన సేల్స్‌ సిబ్బంది ఈ మార్కెట్‌ విభాగాన్ని చూస్తున్నారు.  ఈ ఫలితాలు చక్కగా ఉన్నాయి. నవంబర్‌లో నెలవారీ ఏఏయుఎంలో 3% నాన్‌ అసోసియేట్‌ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా వస్తే అది నవంబర్‌ 2020 నాటికి 11% వృద్ధి చెందింది. నిజానికి, మార్చి 2020లో 6% ఉంటే నవంబర్‌ 2020 నాటికి దాదాపు రెట్టింపు అయి 11%కు చేరింది.
 
శ్రీ వినయ్‌ పహారియా, చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ (సీఐఓ), యూనియన్‌ ఎస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాట్లాడుతూ, ‘‘మా పెట్టుబడి విధానం ద్వారానే మా పెట్టుబడి నిర్ణయాలు నడుపబడుతున్నాయి. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులలో, మేము ఎస్సెట్‌ కేటాయింపుల ఆధారిత మ్యూచువల్‌ ఫండ్‌ ఉత్పత్తులను సూచిస్తున్నాము. ఐటీ మరియు టెలికామ్‌ వంటి రంగాలకు ప్రాధాన్యతనివ్వడంతో పాటుగా అండర్‌వెయిట్‌ యుటిలిటీ, కన్స్యూమర్‌ డిస్ర్కిషనరీ రంగాలకు ప్రాధాన్యతనిస్తున్నాం. ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ పరంగా, ఆర్ధిక వృద్ధి పూర్తిగా కోలుకునేంత వరకూ సాధారణ వడ్డీరేటు సమీపకాలంలో కొనసాగుతుందని మేము నమ్ముతున్నాము. మా వరకూ అయితే, ఈక్విటీ మరియు ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ మార్కెట్‌లలో రిస్క్‌ ఉందనుకుంటున్నాం. ఊహాతీతంగా ఏదైనా కారణాల చేత ద్రవ్యోల్భణం పెరిగితే, వడ్డీరేట్లు పెరిగే అవకాశాలున్నాయి’’ అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు