ఎడ్యుస్కిల్స్ వర్చువల్ ఇంటర్న్‌షిప్ అవార్డ్స్ 2024లో టాప్ ర్యాంకింగ్స్ సాధించిన కెఎల్‌హెచ్ హైదరాబాద్ క్యాంపస్

ఐవీఆర్

గురువారం, 3 అక్టోబరు 2024 (22:50 IST)
ఎడ్యుస్కిల్స్ వర్చువల్ ఇంటర్న్‌షిప్ ర్యాంకింగ్స్ 2024లో అసాధారణమైన ప్రదర్శనను చేసినట్లు కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్శిటీ వెల్లడించింది. ఈ విశ్వవిద్యాలయం అధునాతన ఇంటర్న్‌షిప్ పర్యావరణ వ్యవస్థను సృష్టించడం ద్వారా "డిజిటల్ వర్క్‌ఫోర్స్ ఆఫ్ టుమారో" ని నిర్మించటంలో అందించిన తోడ్పాటుకు గానూ ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి  ర్యాంకింగ్‌లను పొందింది, దాని విజయవాడ క్యాంపస్‌కు 4వ స్థానం మరియు హైదరాబాద్ క్యాంపస్‌కు 7వ స్థానం సాధించింది.
 
ఎడ్యుస్కిల్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రోగ్రామ్‌లో దాని అత్యుత్తమ తోడ్పాటు, అత్యున్నత పనితీరు కోసం యూనివర్శిటీ తన కీర్తిని మరింత మెరుగుపరుచుకుంటూ, సౌత్ సెంట్రల్ జోన్‌లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన విశ్వవిద్యాలయంగా గౌరవించబడింది. భారత ప్రభుత్వ, ఏఐసిటిఈ,  నేషనల్ ఇంటర్న్‌షిప్ పోర్టల్, హ్యూమన్-లైక్ ఏఐ అనువాదిని మద్దతుతో న్యూఢిల్లీలో జరిగిన 'ఎడ్యు స్కిల్స్ కనెక్ట్ 2024 ట్రాన్స్‌ఫార్మ్ టుగెదర్ నెక్స్ట్ జెన్ స్కిల్ కాన్క్లేవ్‌'లో ఈ ప్రతిష్టాత్మక అవార్డులు అందించబడ్డాయి. డిసెంబర్ 1, 2023 నుండి సెప్టెంబర్ 30, 2024 వరకు విస్తరించి ఉన్న వర్చువల్ ఇంటర్న్‌షిప్ కోహోర్ట్‌లు 7, 8 మరియు 9లో విద్యార్థులు విజయవంతంగా పూర్తి చేసిన విధానము ఆధారంగా ర్యాంకింగ్‌లు అందించబడ్డాయి.
 
ఇన్స్టిట్యూషన్ స్థాయి ప్రశంసలతో పాటు, ఎడ్యుస్కిల్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సిఓఈ) ప్రోగ్రామ్‌కు తమ స్థిరమైన మద్దతు, గణనీయమైన సహకారాన్ని అందించిన అనేక మంది వ్యక్తులు గుర్తింపు పొందారు:  వైస్ ఛాన్సలర్ ఎక్సలెన్స్ అవార్డును కె ఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, డాక్టర్ జి.పి.ఎస్ వర్మ అందుకున్నారు; డీన్ ఎక్సలెన్స్ అవార్డును డీన్ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్, డాక్టర్. ఎ శ్రీనాథ్ అందుకున్నారు; ప్రిన్సిపల్ ఎక్సలెన్స్ అవార్డుతో కెఎల్ హెచ్ హైదరాబాద్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆకెళ్ల రామకృష్ణను సత్కరించారు; ఉత్తమ సెంటర్ కోఆర్డినేటర్ అవార్డును డాక్టర్ వి వర ప్రసాద్  అందుకున్నారు; ఉత్తమ రచయిత మరియు సలహాదారు అవార్డు డాక్టర్ కె శ్రీనివాస్‌కు లభించింది. ఇంకా, ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్ & గ్లోబల్ ఎంగేజ్‌మెంట్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్. ఎస్ శ్రీథర్ "ఎడ్యుకేటర్ ఎక్సలెన్స్ అవార్డ్ (ఏడబ్ల్యుఎస్ అకాడమీ)- 2024 (సౌత్ సెంట్రల్ జోన్)" అందుకున్నారు.
 
అదనంగా, విద్యార్థి మారా లోకేష్ ఎన్ శ్రీ ప్రభు సూర్య, జునిపర్ నెట్‌వర్క్స్ నుండి పూర్తి-సమయ ఉపాధి ఆఫర్‌లను పొందారు, దీనిని అవార్డుల వేడుకలో ఏఐసిటిఈ గౌరవనీయ చైర్మన్ మరియు జునిపర్ నెట్‌వర్క్స్ సీఈఓ అందించారు. కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డా. జి. పార్ధ సారధి వర్మ ఇటీవల తాము పొందిన ప్రశంసల పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, "తమ విద్యా మరియు వృత్తిపరమైన ప్రదర్శన పరంగా ప్రతి అంశంలో శ్రేష్ఠతను సాధించడానికి మా విద్యార్థులు మరియు అధ్యాపకులు చూపుతున్న అచంచలమైన నిబద్ధత మరియు అంకితభావాన్ని ఈ ప్రశంసలు ప్రతిబింబిస్తాయి. విద్య యొక్క ప్రమాణాలను నిరంతరం పెంచడానికి, వినూత్న మరియు ఆచరణాత్మక ఇంటర్న్‌షిప్ అవకాశాల ద్వారా నైపుణ్యాభివృద్ధిని పెంపొందించే వాతావరణాన్ని సృష్టించడానికి వారు మా సంకల్పాన్ని ప్రదర్శిస్తారు"అని అన్నారు.
 
ఈ ప్రతిష్టాత్మక ప్రశంసలను ఏఐసిటిఈ ఛైర్మన్, ఏఐసిటిఈ యొక్క సిఓఓ మరియు దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం(సార్క్) అధ్యక్షుడితో సహా ప్రముఖులు అందించారు, విద్యలో శ్రేష్ఠత మరియు ఆవిష్కరణలకు విశ్వవిద్యాలయం యొక్క నిబద్ధతను ప్రదర్శించారు. ఈ గుర్తింపు విద్యార్థులు, అధ్యాపకులు మరియు మార్గదర్శకుల కృషి మరియు అంకితభావాన్ని వేడుక జరుపుకుంటుంది మరియు విద్య యొక్క భవిష్యత్తును రూపొందించడంలో దాని నాయకత్వాన్ని హైలైట్ చేస్తుంది.
 
కెఎల్ హెచ్ అజీజ్ నగర్ క్యాంపస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ రామకృష్ణ తన సంతోషాన్ని పంచుకుంటూ, "ఈ ప్రశంసలు మా విశ్వవిద్యాలయానికి శక్తివంతమైన ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి, మా విద్యా విషయాలలో మరింత ఉన్నత లక్ష్యాన్ని సాధించేలా ప్రోత్సహిస్తాయి. అటువంటి విశిష్ట వేదికపై వర్చువల్ ఇంటర్న్‌షిప్‌లలో మా ప్రయత్నాలకు  గుర్తింపు పొందడం చాలా సంతోషంగా ఉంది. ఈ గుర్తింపు  మా నిబద్ధతను పునరుద్ఘాటించడమే కాకుండా, ఉన్నత విద్యారంగంలో సారథ్యం వహించడానికి మరియు ఆవిష్కరింపజేయాలనే మా సామూహిక ఆశయానికి శక్తినిస్తుంది.." అని అన్నారు.
 
హైదరాబాద్ మరియు విజయవాడలో క్యాంపస్‌లతో, ప్రాక్టికల్ మరియు హ్యాండ్-ఆన్ లెర్నింగ్ అనుభవాల ద్వారా గ్లోబల్ సవాళ్లకు విద్యార్థులను సిద్ధం చేయడానికి అంకితమైన ఒక ప్రధాన విద్యా సంస్థగా కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్శిటీ కొనసాగుతోంది. ఎడ్యుస్కిల్స్ , ఒక లాభాపేక్ష లేని సామాజిక సంస్థ, నేటి పోటీ ఉద్యోగ మార్కెట్‌కు అవసరమైన తదుపరి తరం నైపుణ్యాలతో విద్యార్థులను సిద్ధం చేయటం  ద్వారా ఉపాధిని మెరుగుపరచడానికి మాలాంటి విద్యా సంస్థలతో భాగస్వామ్యం చేసుకుంటుంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు