దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1500 పోస్టులను 2024-25 ఆర్థిక సంవత్సరంలో భర్తీ చేయాలని యూనియన్ బ్యాంక్ (యూబీఐ) నిర్ణయం తీసుకుంది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాని 200, తెలంగాణకు 200 పోస్టులను కేటాయించింది.
డిగ్రీ పూర్తి చేసి 20 నుంచి 30 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు ఈ పోస్టులకు ధరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయసులో ఐదేళ్ల సడలింపు ఇచ్చింది. అలానే ఓబీసీ కేటగిరికి చెందిన వారికి 3, జనరల్ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పది సంవత్సరాలు వయో పరిమితి సడలింపు వర్తిస్తుందని వెల్లడించింది.
దరఖాస్తు రుసుము విషయానికి వస్తే జనరల్ అభ్యర్థులు రూ.850లు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్యూడీ అభ్యర్థులు మాత్రం దరఖాస్తు రుసుముగా కేవలం రూ.175లు చెల్లించాల్సి ఉంటుంది. జీతం రూ.48,480ల నుంచి రూ.85,920ల వరకు ఉంటుందని తెలిపింది. అర్హులైన అభ్యర్ధులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో ఉత్తీర్ణులై అర్హత సాధించిన వారికి నేరుగా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేయనున్నారు.