ఆడుతూ పాడుతూ తిరిగే ఓ చిన్నారి జీవితాన్ని ఒక యాపిల్ ఛిన్నాభిన్నం చేసేసి... అతడిని పూర్తిగా చక్రాల కూర్చీకే పరిమితం చేసేసింది. న్యూజిలాండ్‌లో జరిగిన ఈ సంఘన వివరాలలోకి వెళ్తే... న్యూజిలాండ్ రొటారులోని రెండేళ్ల బాలుడు నిహాన్ రెనాటా తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. దీంతో వారు రెనాటాను డే-కేర్‌లో వదిలి పెట్టి వెళ్లేవారు. డే-కేర్ సెంటర్‌లోని టీచర్ ఓ రోజు రెనాటాకు యాపిల్ ముక్క ఇచ్చి తినమని చెప్పింది.
అయితే... యాపిల్ ముక్క రెనాటా గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక ఇబ్బందిపడ్డాడు. ఆ తర్వాత అతడికి గుండె నొప్పి వచ్చింది. దీనితో ఖంగారు పడిన డే-కేర్ సిబ్బంది రెనాటాను హుటాహుటిన ఆసుపత్రిలో చేర్చారు. కొద్దిసేపటి తర్వాత అతడి శరీరంలో కదలిక లేకుండా... కాళ్లు, చేతులు, శరీరంలోని అన్ని భాగాలు చచ్చుపడిపోయి పక్షవాతానికి గురయ్యాడు.