కోవిడ్ 19 పరిస్థితి ఇలాగే వుంటే 20 లక్షల మంది మరణం: ఆందోళనలో WHO

శనివారం, 26 సెప్టెంబరు 2020 (15:07 IST)
కరోనావైరస్ మొదట చైనాలో వెలుగు చూపింది. ఆ తర్వాత యూరప్ దేశాలకు పాకిన ఈ మహమ్మారి క్రమంగా ప్రపంచమంతా విస్తరించింది. ముఖ్యంగా యూరప్ లోని ఇటలీ, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలు ప్రాణాంతక వైరస్ ప్రభావంతో అతలాకుతలం అయ్యాయి. అయితే యూరప్ దేశాలలో కొన్నాళ్లుగా సద్దుమణిగినట్టే కనిపించిన కరోనా భూతం మళ్లీ జడలు విప్పడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
 
స్పెయిన్, ఫ్రాన్స్, పోలెండ్ వంటి దేశాలలో కొత్త కేసులు వచ్చిన దరిమిలా అక్కడ లాక్‌డౌన్ ప్రకటించారు. బ్రిటన్, రష్యా దేశాలలోను ఆక్షలు అమలు చేస్తున్నారు. అవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావద్దని రష్యన్లకు అక్కడి ప్రభుత్వం స్పపష్టం చేసింది.
 
ఈ పరిస్థితులపై డబ్ల్యూహెచ్ఓ స్పందిస్తూ పరి స్థితి ఇలాగే కొనసాగితే 20 లక్షల మరణాలు సంభవించే అవకాశం ఊందని తెలిపింది. కరోనా నియంత్రణకు సరైన చర్యలు తీసుకోపోతే మరింత వినాశనం తప్పదని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ మైఖేల్ రాన్ వివరించారు. గత ఆర్నెళ్లుగా ప్రపంచ దేశాలను కరోనా భూతం పట్టి పీడిస్తుండగా ఇప్పటివరకు 9.85 లక్షలు మంది మృత్యువాత పడ్డారు. 32.3 మిలియన్ల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు