ఏపీలో కరోనా వైరస్: 629 కొత్త కేసులు.. ఎనిమిది మంది మృతి

శనివారం, 9 అక్టోబరు 2021 (20:24 IST)
ఏపీలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుతూ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 45,818 మందిని పరీక్షించారు. వీరిలో 629 కరోనా కేసులు వచ్చాయి. కరోనా సోకిన ఎనిమిది మంది చనిపోయారు.

కరోనా వైరస్ నుంచి నిన్న 797 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 8134 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా వల్ల ప్రకాశంలో ముగ్గురు, కృష్ణాలో ఇద్దరు, చిత్తూరు, తూర్పు గోదావరి, విశాఖపట్టణంలో ఒక్కరు చొప్పున చనిపోయారు.
 
ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది.

వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు