దేశంలో సెకండ్ కరోనా వేవ్ తగ్గుముఖం పట్టడంతో వెంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్కూల్స్ రీ ఓపెన్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. దీనిపై పలువురు నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడే పిల్లలను బయటకి పంపడం సమంజసం కాదని అభిప్రాయపడుతున్నారు.
స్కూల్స్ లో విద్యార్థులు, టీచర్లు, హెల్పర్లు అందరూ ఒకేచోట ఉండాల్సి వస్తుందని.. ఇది వైరస్ వ్యాప్తికి మనమే అవకాశం ఇచ్చినట్లు అవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యాక్సిన్ అందించే పెద్దవారిలో కనీసం ఎక్కువ మందికి ఇచ్చిన అనంతరం.. పిల్లలలో కొంతభాగమైనా వ్యాక్సినేషన్ ఇచ్చిన అనంతరమే స్కూల్స్ రీఓపెన్ చేయడం మంచిదని పేర్కొన్నారు.