ఇదేంటి? కరోనా మృతదేహాన్ని ఆటోలో తరలిస్తారా? పీపీఈ కిట్లు లేకుండానే?

శనివారం, 11 జులై 2020 (17:34 IST)
నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇప్పటికే కరోనా బాధితుల మృతదేహాల తరలింపుపై దారుణాలు జరుగుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో.. తాజాగా..నిజామాబాద్ జిల్లాలో కరోనా బాధితుడి మృతదేహం తరలింపులో గందరగోళం నెలకొంది. 
 
కరోనా మృతుడి మృతదేహం ఆటోలో తరలించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వాస్పత్రిలో అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడంతో ఆటోలో తరలించామని బాధితుడి బంధువులు చెప్తున్నారు. అయితే ఇలా తరలించడం నిబంధనలకు విరుద్ధం. 
 
కరోనాతో మృతిచెందిన వ్యక్తి మృతదేహాన్ని అంబులెన్స్ లేదా ఎస్కార్ట్ వాహనంలో సిబ్బంది కచ్చితంగా పీపీఈ కిట్లు ధరించి చాలా జాగ్రత్తగా తరలించాల్సి ఉంటుంది. కానీ ఆస్పత్రి వైద్యులు ఏమాత్రం పట్టంచుకోకుండా.. ఇలా ఆటోలో తరలించకూడదు. 
 
అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా తరలించాల్సి వచ్చిందని బాధితుడి కుటుంబీకులు, బంధువులు చెబుతున్నారు. అయితే తరలించేటప్పుడు ఆటో డ్రైవర్ కానీ.. పక్కనే ఉన్న మరో వ్యక్తిగానీ పీపీఈ కిట్లు ధరించకపోవడం ప్రస్తుతం వివాదాలకు తావిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు