దేశంలో ఆ ఆరు రాష్ట్రాల్లో కరోనా.. అంతా నిర్లక్ష్యమే కారణం

మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (13:14 IST)
దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్‌గఢ్, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాయి. 
 
మహారాష్ట్ర రాజధాని ముంబైలో జనం నిర్లక్ష్యం కారణంగా పెద్ద సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు మాస్కు ధరించని వారికి రూ.200 చొప్పున జరిమానా విధిస్తున్నా వారి తీరు మారడంలేదు.
 
మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నా ముంబైకర్లు పట్టించుకోవడంలేదు. గత మూడు రోజుల వ్యవధిలోనే 17,500 మంది మాస్కులు ధరించకూడా పట్టుబడ్డారంటే వారి నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 
 
ముంబైలోని శని, ఆది, సోమ వారాల్లో 17,500 మంది నుంచి రూ.35 లక్షల జరిమానా వసూలు చేసినట్లు బీఎంసీ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ఈ సాయంత్రం నాలుగు గంటలకు కొవిడ్ పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు